శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలకరి వరి చేలలో మాంగనీస్ లోపం : ఏడిఏ అరుణ

1 గంట క్రితం

Manganese deficiency in early-season paddy fields: ADA Aruna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గంగవరం (కోనసీమ) : ప్రస్తుతం నాట్లు వేసిన తొలకరి వరి చేలలో మాంగనీస్ లోపం కనిపిస్తుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మద్దిపూడి అరుణ తెలిపారు. ఆమె కె.గంగవరం మండలంలోని దంగేరు గ్రామంలో శనివారం క్షేత్ర స్థాయిలో వరి చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ డి ఏ మాట్లాడుతూ .... ప్రస్తుతం ఎల్నినో అధిక ఉష్ణోగ్రత లో మార్పులు నేపధ్యంలో ఎరువులు వాడకం లో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అసమతుల్యత లేకుండా చూసుకోవాలని, తక్కువ భాస్వరం, పొటాష్ వాడకం నేపథ్యంలో మాంగనీస్ లోపం కనపడుతోందని ఆమె రైతులకు తెలియజేశారు. దీని నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ లేదా ఫార్ములా 4 ను 10గ్రాములు చొప్పున మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. దీంతో మాంగనీస్ లోపాన్ని నివారించుకోవచ్చు అని ఆమె రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సద్గురుమూర్తి, విఏఏ పావని, క్రుష్ణతేజ, నీటి సంఘం ఉపాధ్యక్షుడు ఓబిలినేని శ్రీను రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్