ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : రెండు జిల్లాల సరిహద్దుగా ఉండి ఆక్రమణలకు గురైన మండలంలోని మడికి శివారు మల్లావానితోట జిల్లా పరిషత్ రోడ్డును ఆ గ్రామ ప్రత్యేక అధికారి, ఆలమూరు ఎంపీడీవో ఎ.రాజు పరిశీలించారు. పత్రికల్లో ప్రచురించిన కథనాలపై స్పందించిన ఆయన కడియం-ఆలమూరు మండలాలకు సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ 39 సెంట్లు నీరు పోయేందుకు మడికికి చెందిన ప్రభుత్వం స్థలం ఉండాలన్నారు. దాన్ని పూర్తిగా కబ్జా చేసి ఇల్లు నిర్మించుకుని నీరు పోవడానికి దారి లేకుండా చేయడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుని వర్షపు నీరు పోయేందుకు మార్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఆక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేసి అవన్నీ ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన స్థానిక అధికారులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటరత్నం, విఆర్ఓ డి.సుదర్శన్ బాబు, విలేజ్ సర్వేయర్ మౌనిక, గుమస్తా సతీష్, తదితరులు ఉన్నారు.
రోడ్డు ఆక్రమణలు పరిశీలించిన ఎంపీడీవో
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 03:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)