శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెముడులంక కూటమి సర్పంచ్ అభ్యర్థి నాగిరెడ్డి మాత్రమే

5 రోజుల క్రితం

Nagireddy is the only candidate for Sarpanch from the Chemudulanka alliance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

స్థానిక ఓటర్లకు గెలిపించాలని విజ్ఞప్తి చేసిన జనసేన ఇంచార్జ్ శ్రీనివాస్


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంకకు కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థితో పాటు 12 మంది వార్డు సభ్యుల విజయానికి కూటమి నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం చెముడులంక కూటమి నేతలు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో, కూటమి నాయకులతో కలిసి వాడపాలెం జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఆయన ఈ నెల 29న జరగనున్న ఎన్నికలలో కూటమి పార్టీ తరఫున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చెముడులంకకు చెందిన నాగిరెడ్డి శ్రీ శంకర వెంకట కళ మాత్రమేనని, మరి ఎవరిని కూటమి బలపరచలేదని, ఆమె ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. అలాగే ఈ నెల 29న జరగనున్న ఎన్నికలలో చెముడులంక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బరిలో నిలిచిన కూటమి తరఫున పోటీ చేస్తున్న 12 మంది వార్డు సభ్యుల అభ్యర్థులను సైతం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామ అభివృద్ధికి ఐకమత్యంతో ముందుకు సాగుతూ, కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ తమ అమూల్యమైన మద్దతు అందించాలని నాయకులు ముక్త కంఠంతో ప్రజాక్షేత్రంలో అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొత్తపల్లి రాంబాబు, గుండుమళ్ళ రాంబాబు, అడబాల వీర్రాజు, సిరంగుల సతీష్, దూలం వెంకటేశ్వరరావు, లంకలపల్లి ఆంజనేయులు, తమ్మన ఏసు, పామర్తి పేర్రాజు, పాలూరి చిరంజీవి, అడబాల ఆదినారాయణ, దూలం ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్