ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : ఒకటవతరగతి విద్యార్థికి నిర్దేశించిన అభ్యసన స్థాయి సామర్థ్యాలు నూరుశాతం సాధించేలా ఉపాధ్యాయులు బోధన ఉండాలని సమగ్ర శిక్షా జిల్లా అకాడమిక్ మా నిటరింగ్ అధికారి వై. లక్ష్మణకుమార్ ఉపాధ్యాయులను కోరారు.
స్థానిక బై పాస్ రోడ్ లో గల సిమెటరీపేట మునిసిపల్ కార్పొరేషన్ ప్రాధమిక పాఠశాల ను మంగళవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల నిర్వహణ, టాయిలెట్స్ నిర్వహణ బావుందన్నారు. వేసవి లో నిర్వహించిన విద్యా మిత్ర, జి ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం లో విద్యార్థి స్థాయి, ప్రస్తుత స్థాయిని విద్యార్థులను ప్రశ్నించి తెలుసుకున్నారు.జి ఎఫ్ ఎల్ ఎన్ (పునాది అభ్యసనం)లో 85శాతం ప్రగతి ఉందని ప్రధానోపాధ్యాయిని రాధాకుమారి, ఉపా ధ్యాయులను అభినందిస్తూ.. నూరుశాతం ప్రగతి సాధించాలన్నారు.. అక్షర గుర్తింపు, పదాల ను పలకడం పై ఎక్కువ కృత్యాలు చేయించాలన్నారు. బోధన లో సమగ్ర శిక్షా ద్వారా అందించిన టి ఎల్ ఎమ్ కిట్స్, జాదూ పితారా కిట్స్ ఉపయోగించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ నూరుశాతం పంపిణీ చేసి, విద్యార్థులు, తల్లితండ్రుల బయోమెట్రిక్ అక్విటెన్స్ పూర్తి చేయాలన్నారు. సి ఆర్ ఎమ్ టి జయంతి శాస్త్రి, ప్రధానోపాధ్యాయిని రాధాకుమారి, ఉపాధ్యాయినులు కె ఉమామహేశ్వరి, ఎం వి లక్ష్మి, జి వి లక్ష్మి, ఎమ్.లీనా పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)