మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల నిరసన; నేర చరిత్ర లేని పిల్లలను తక్షణమే విడుదల చేయాలి: సుప్రీంకోర్టు

1 గంట క్రితం

supremecourt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 01:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద, వివిధ రాష్ట్రాల్లో జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులందరినీ తక్ష‍ణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వారిని కేవలం నిరసనల పేరుతో జైలులో పెట్టకూడదని కోర్టు పేర్కొంది. హింసా ఘటనలు, పోలీసుల అరాచకాలపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాన్ని జారీ చేసింది.
నిరసనల సమయంలో అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన 18 ఏళ్లలోపు విద్యార్థులను, నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల క్రూరత్వ ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరగడం అత్యవసరం అని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్