ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ (తూర్పు గోదావరి) : కార్మికులకు కనీస వేతనం 26 వేలు పెంచాలని కోరుతూ జులై 30, 31 తేదీలలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి.పవన్ పిలుపునిచ్చారు. స్థానిక శ్యామల సెంటర్ లో మంగళవారం సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను కార్మికులకు 2012 నుండి ఏళ్ల తరబడి సవరించటం లేదన్నారు. షెడ్యూల్ పరిశ్రమలకు 19 సంవత్సరాలు పైగా వేతన సవరణలు జరగడం లేదన్నారు. నాటి వేతనంతో నేటి జీవనం సాగించడం చాలా ఇబ్బంది గా ఉందని అన్నారు. కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన బయటపడుతున్నారన్నరు. రాష్ట్రంలో కనీస వేతనాల కొరకు సిఐటియు ఆధ్వర్యంలో జూలై 30,31 తారీకులలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరుగుతుందని, కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను దేశంలో ముందుగా అమలకు సిద్ధపడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల హక్కులను కాలరాయటానికి ముందుకు వస్తున్నటువంటి పాలకులు కార్మికుల వేతనాలు పెంపు కొరకు మాత్రం కనీస ఆలోచన కూడా చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అప్కాస్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, సొసైటీ కార్మికులకు వేతనాలు పెంచాలని, రెగ్యులర్ చేసి మినిమం టైమ్ స్కేల్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పని భారం పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు. మహిళలు రాత్రిపూట పనిచేయటం, 12 గంటల పని విధానం కొరకు నిర్ణయాలు చేస్తున్నటువంటి పాలకులు కనీస వేతనాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్న కనీస వేతనాలు మాత్రం అమలు కావటం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీ, ఆశా ఇతర స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.పూర్ణిమారాజు, శ్రీనివాస్ , ఐ సుబ్రహ్మణ్యం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనాలు రూ.26 వేలు పెంపు కోసం 30, 31 చలో కలెక్టరేట్ : సిఐటియు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 01:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)