శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పంచాయతి, రెవిన్యూ ఉద్యోగులు

30 అక్టోబర్, 2026

Panchayat and revenue employees who work day and night for the people
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రకృతి ప్రకోపం.. ప్రజల రక్షణే లక్ష్యంగా సేవలు

కుటుంబాలను పక్కనపెట్టి.. విధి నిర్వహణకు ప్రాధాన్యత..


ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : అర్నబ్ తుఫాను ప్రభావంతో డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడికక్కడ భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారులపై చెట్లు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతోశుక్రవారం కూడా గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంచాయతి, రె విన్యూ అధికారులు, సిబ్బంది అందించిన సేవలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఒకవైపు తుఫాను గాలులు, వర్షాలు కొనసాగుతున్నప్పటికీ పోలీస్,, పంచాయతీరాజ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి రహదారులకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షాలను తొలగిస్తూ ప్రజలకు రాకపోకల ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. తుఫాను తీవ్రత తగ్గిన మరుసటి రోజునుంచిఅప్పనపల్లి, పెదపట్నం లంక, నగరం,మొగలికుదురు,పాశర్లపూడి లంక, పెదపట్నం గెద్దాడ తదితరగ్రామాల లో పంచాయతి సెక్రటరీ లు సహాయక చర్యలను కొనసాగిస్తూ ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లను తొలగించి రహదారులను పునరుద్ధరించేందుకు శ్రమించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులలో కదలిక కాన రాలేదు. దింతో స్థానికులు స్తంబాలు పై పడిన చెట్లు కొమ్మలు తొలగించడం పనులు చేపట్టారు తుఫాను ధాటికి విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తూ, తెగిపోయిన విద్యుత్ వైర్లను తిరిగి అనుసంధానం చేస్తూ దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో తుఫాను సమయంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది కుండపోత వర్షంలోనూ రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించారు.విధి నిర్వహణలో సిబ్బంది చూపిన అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అందించే సేవలు ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటాయోఅర్ణబ్ తుపాన్ మరోసారి చాటిచెప్పింది. విపత్కర పరిస్థితుల్లో ముందుండి సహాయక చర్యలు చేపట్టిన అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి సేవలను ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్