ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రానికి చెందిన శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత, కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావును థాయిలాండ్ నుంచి వచ్చిన సి.పి.ఎఫ్ ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం, ఈతకోటలోని శ్రీ కృష్ణ రైస్‌మిల్, స్థానిక మండలంలోని పెదపళ్ళలోని శ్రీ మురళీకృష్ణ ట్రేడర్స్ రైస్‌మిల్లులను ప్రతినిధులు సందర్శించి, మిల్లుల నిర్వహణ, బియ్యం ఉత్పత్తి, తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పాపారావు వారిని ఆత్మీయంగా సత్కరించి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలను బహూకరించారు. ముందుగా విదేశీ ప్రతినిధులను సంప్రదాయ పద్ధతిలో పాపారావు ఆత్మీయంగా ఆహ్వానించగా, పరస్పర పరిచయాలు, వ్యాపార సంబంధిత అంశాలపై కూలంకషంగా చర్చించి వారంతా సంతృప్తిని వ్యక్తం చేశారు.
థాయిలాండ్ ప్రతినిధులకు పాపారావు ఆత్మీయ సత్కారం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)