ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో కూడిన, తప్పులు లేని పాసు పుస్తకాలు రైతులకు అందజేస్తున్నామని, అవి వారికి ఎంతో కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మండలంలోని జొన్నాడలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయంలో జగన్ తన సొంత ఫోటోలతో పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ఈ అంశాన్ని గమనించి, రైతుల ఆందోళనను అర్థం చేసుకొని పాత వాటిని రద్దు చేసి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తుందన్నారు. ఈ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తమ భూమి వివరాలు రైతులకు పూర్తిగా తెలుస్తాయన్నారు. అంతటి టెక్నాలజీతో ఈ పాస్ పుస్తకాలలో జరిగిన తప్పులన్నీ సరి దిద్దుతూ అందించడం జరిగిందన్నారు. జొన్నాడ లో 3,028 ఎకరాల భూమి ఉండగా హక్కుదారులు ఎల్పీఎంల రూపంలో 2,036 మంది ఉన్నారన్నారు. వీరికి 1628 రికార్డులు ఉండగా పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా, సరిచేసి పాస్ బుక్స్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె.కుశరాజు, టిడిపి మండల అధ్యక్షుడు పేదల సత్తిబాబు, సొసైటీ చైర్మన్ మేడపాటి రామారెడ్డి, నేతలు తాడి శ్రీనివాసరెడ్డి, గొడవర్తి బాబి, నామాల సూరిబాబు, భావన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రైతాంగానికి కీలకమైనవి పట్టాదారు పాసుబుక్స్ : జొన్నాడ పంపిణీలో ఎమ్మెల్యే బండారు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)