ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని మడికి రవీంద్ర కాన్వెంట్ లో నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ ఏ.గజలక్ష్మి ఆదేశాల మేరకు .. ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి దేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సమాజ, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకే అధిక సంఖ్యలో యువత మాదకద్రవ్య రహిత భారత్ ఉద్యమంలో చేరడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. దేశం విసిరిన ఈ సవాలును స్వీకరిస్తూ, ఈ రోజు మనమందరం 'నషా ముక్త్ భారత్ అభియాన్' పేరుతో ఏకమై, కేవలం సమాజం, కుటుంబం, స్నేహితులే కాకుండా మనమూ మాదకద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. మన జిల్లాను, రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి మనమందరం కలిసి గట్టి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ‘‘నా దేశాన్ని మాదకద్రవ్య రహిత దేశంగా మార్చడానికి నా శాయశక్తులా సాధ్యమైనదంతా చేస్తానని’’ విద్యార్థులతో కలిసి వారంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ కె.మెర్సీ ఫ్లోరెన్స్, సిహెచ్. మంగ తయారు, సిహెచ్.భాను, పి.సత్యవతి, ఏం.దేవి శ్రీదేవి, పి.శ్రీలక్ష్మి, కాన్వెంట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కోసం ప్రతిజ్ఞ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)