ప్రిన్సిపాల్ సురేష్ రెడ్డి, బాలమందిరం కన్వీనర్ కృష్ణశ్రీ పిలుపు
ప్రజాశక్తి - ఆలమూరు : ఓజోన్ పొరను కాపాడటం మనందరి బాధ్యతని, ఆ పొర దెబ్బతింటే మానవాళి వినాశనం తప్పదని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లమిల్లి సురేష్ రెడ్డి, బాలమందిరం కన్వీనర్ కృష్ణశ్రీ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని, మొక్కలు నాటి చెట్లను పెంచి ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించడం ద్వారా సమాజ శ్రేయస్సుకు దోహదపడిన వాళ్లమవుతామన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కైనా నాటాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులు కొత్తూరు సెంటర్ వరకు ఓజోన్ పరిరక్షణ మన బాధ్యత, గ్లోబల్ యాక్షన్ ఫర్ కూలర్ ప్లానెట్, చల్లని భూమి కోసం కలిసి పని చేద్దాం అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. అనంతరం కళాశాల వద్ద ఓజోన్ ఫార్ములా ఓ3 రూపంలో కూర్చొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)