ప్రజాశక్తి - ఆలమూరు : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై అన్ని పార్టీల నాయకులతో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా ఏ గ్రామంలో పోలింగ్ కేంద్రం మార్పు చేయాలో తెలియజేయాలని కోరారు. అలాగే ఓటర్లకు అనుకూలమైన పోలింగ్ కేంద్రాలపై కులంకషంగా చర్చించారు. మార్పు చేర్పులను నాయకులు తెలియజేయడంతో సమీక్ష ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ గ్రామాలలో పలు పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు వచ్చినట్లు స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ మేరకు సాధ్యసాద్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, టిడిపి మండల కార్యదర్శి సలాది నాగేశ్వరరావు, జనసేన సీనియర్ నేత సంగీత సుభాష్, వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, బిజెపి నేత సుంకర శ్రీరాములు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై నాయకులతో సమీక్ష
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)