ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని జొన్నాడలో శివలోరి పుంత(జొన్నాడ సత్తివారి వీధి నుంచి జొన్నాడ సెంటర్ పిల్లకాలవ వంతెన దాకా 3 కిలోమీటర్ల మేర) రోడ్డు నిర్మాణం కోసం స్థానిక కూటమి నేతలు ప్రయత్నం ఎట్టకేలకు సఫలమైంది. ఈ మేరకు ఆదివారం పంచాయతీరాజ్ ఏఈ డి.వీరభద్రరావు, కూటమి నాయకులతో కలిసి పుంత మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ద్వారా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. దీంతో ఎంఎల్ఏ బండారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డితో మాట్లాడడంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కి సిఫార్సు చేయడం జరిగిందన్నారు. దీంతో సుమారుగా మూడు కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ. 1.30 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ రహదారి గ్రామంలో వైయస్సార్ విగ్రహం నుంచి సెంటర్లోని వైయస్సార్ విగ్రహం వరకు అభివృద్ధికి కొలతలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ వీరభద్రరావు తెలిపారు. దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకోని తమ గ్రామ పరిధిలో పుంత రోడ్ నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కి, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కి, ఈ రోడ్డు శాంక్షన్ కొరకు మాకు అన్ని విధాల సహకరించి, ఫలించేందుకు కృషిచేసిన జి.ఎస్.ఎన్.మూర్తి కి జొన్నాడ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తాడి శ్రీనివాసరెడ్డి, ఏఏంసి మాజీ ఉపాధ్యక్షుడు గొడవర్తి బాబి, సొసైటీ చైర్మన్ మేడపాటి రామారెడ్డి, నేతలు నామాల సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
జొన్నాడ పుంత రోడ్డుకు రూ. 1.30 కోట్లు మంజూరు
11 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)