ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కాకినాడకు చెందిన చేయూత చారిటబుల్ సొసైటీ ప్రకటించిన రాష్ట్రస్థాయి టీచర్ ఎక్సలెన్స్ అవార్డు-2026 కు మండలంలోని కొత్తూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కొమ్మిశెట్టి సుజాతకు దక్కింది. విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా బోధన చేస్తున్నందుకుగాను, బోధనలో కృత్యాధార పద్ధతులు, వినూత్న పద్ధతుల ద్వారా బోధిస్తున్నందుకుగాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఈ నెల 12న కాకినాడలో జరిగిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవాలలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆర్ జె డి నాగమణి ,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. సుజాతకు ఈ అవార్డు రావడం పట్ల పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినందుకు మండల విద్యాశాఖ అధికారులు బి.అప్పాజీ, ఎన్.రాజు, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు పాఠశాల హెచ్ఎం వై.వి.వి.రమణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యార్థులు, తదితరులు ఆదివారం ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉపాధ్యాయిని సుజాతకు రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు
30 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)