బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యం

1 గంట క్రితం

konaseema-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు : మామిడి కుదురు ముస్లింవీధి అంగన్ వాడి కేంద్రంలో బుధవారం పోషణ్ మాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. భారతదేశం లో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు గర్భిణీ, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలు,6 సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రతీ ఏటా సెప్టెంబర్ నెల అంతటా రాష్ట్రీయ పోషణ్ మాహ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసంవత్సరం పోషణ్ మాహ్ హమారీ అంగన్వాడీ-హమారీ, మన అంగన్వాడీ మన బాధ్యత అనే నినాదం తో ఈకార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు. సమాజ పోషణ ,సంరక్షణ కేంద్రాలుగా మార్చి ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పోషణ్ మాహ్ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఈకార్యక్రమంలో ఆహార వైవిధ్యం,తాజా వేడి వంటకాలు, సమాజ భాగస్వామ్యం, పోషణతో కూడిన బాల్య విద్య,మాత్రృత్వ వందన యోజన దశాబ్ది ఉత్సవాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ లు అంగన్వాడీ కార్యకర్తలు,తల్లులు,గర్భిణీ ,బాలింతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్