ప్రజాశక్తి-మామిడికుదురు (కోనసీమ) : లూటుకుర్రు లో రైతులకు ప్రకృతి వ్యవసాయం, నానో ఎరువుల వినియోగం మరియు నూతన సాగు పద్దతుల పై మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎ ఒ ఎన్ వి వి సత్యనారాయణ బుధవారం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. భూసారా పరీక్షలు నిర్వహించుకుని వాటి ఫలితాలు ఆధారంగా ఎరువులు వినియోగించుకోవాలని జిల్లా వనరులు కేంద్రం వ్యవసాయఅధికారి జే ఎన్ వి వి మనోహర్ కృష్ణ రైతులుకు సూచించారు. ఈ సందర్భంగా ఆత్మా చైర్మన్ ఆరుమెల్లి సత్య సాయిబాబా మాట్లాడుతూ .... ఈ శిక్షణా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని వరి లో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త ఎమ్ నందకిశోర్ మాట్లాడుతూ ... వరిలో సమగ్ర సస్య రక్షణ నానో ఎరువులు గురించి వివరించారు. మారుటేరు వరి పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త పి. రాధిక మాట్లాడుతూ .... వర్షబావ పరిస్థితిలు వలన ఉష్ణోగ్రతలు పెరిగి వరి పంటలో దిగుబడులు పై ప్రతికూల పరిస్థితులు ఏర్పాడతాయి కావున రైతులు జ్రాగత్తలు తీసుకోవాలని సూచించారు. శాస్త్రవేత డా.రమేష్ బాబు వరిలో కలుపు యజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలుకులు ఏ వి యస్ రాజశేఖర్,మాజీ సర్పంచ్ అడబాల తాతకాపు, మండలటి డి పి అధ్యక్షులు బోనం సత్య నాగేశ్వరావు, నీటి సంఘము అధ్యక్షులు మద్దాల తమ్మన్న , ఆత్మా కమిటి సభ్యులు చెల్లింగి శిరీష, విల్ల శ్రీ రామారావు, తెలగారెడ్డి, నాగేశ్వరావు, రైతులు అడబాల పెద్దిరాజు , కడలి వెంకటేశ్వరులు, ఏ ఈ ఓ కె స్వాతి రమాదేవి, శివరామ కృష్ణ, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు డి. ఉమామహేశ్వరీ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం నానోఎరువుల వినియోగం పై రైతులకు శిక్షణ
05 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)