ప్రజాశక్తి - ఆలమూరు : ఈ నెల 19న మండల వైస్ ఎంపిపిగా బాధ్యతలు చేపట్టిన ఈదల రామారావు(రాంబాబు)ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వైట్ల కనక దుర్గారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా రామారావుకు దుశ్శాలువా కప్పి, ఇండోర్ ప్లాంట్ అందజేసి, అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా దుర్గారావు ఆకాంక్షించారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వైస్ ఎంపిపిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరుతూ, ఈదల రామారావుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
వైస్ ఎంపిపి రామారావుకు సత్కారం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)