ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మళ్లీ గ్యాస్ లీకేజీ - సురక్షిత ప్రాంతాలకు బాధితులు

5 రోజుల క్రితం

Victims of the gas leak incident have moved to safer areas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:35 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక రుద్రవరం సెల్ నంబర్-7 వద్ద మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రజలు ప్రాణభయంతో స్వచ్ఛందంగా అక్కడి నుండి తరలి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, నగరం జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవో ఒ ఎన్ జి సి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... సుమారు 20 సంవత్సరాల క్రితం నగరం ప్రాంతంలో ఇదే తరహా దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని గుర్తు చేశారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం వల్ల పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే, అధికారులతో ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారుల సమాచారం మేరకు ఈ రోజు మధ్యాహ్నానికి పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఒ ఎన్ జి సి ఉన్నతాధికారులు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ , జిల్లా ఎస్పీ రాహుల్ మీనా , స్థానిక జడ్పీటీసీ గొల్లపల్లి అమూల్య , రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ , కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొని సంఘటనా స్థలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
https://prajasakti.com/te-IN/districts/konaseema/victims-of-the-gas-leak-incident-have-moved-to-safer-areas



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్