ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : అమలాపురం లో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 5 వ రోజు కొనసాగిస్తున్న సందర్భంగా ఆదివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేశారు.ప్రస్తుతం అందుతున్న రూ.10,500 గౌరవ వేతనంతో జీవనం సాగించడం ఎంతో కష్టంగా ఉందని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్ఏ లకు పే స్కేల్ అమలు చేయాలి,అర్హత కలిగిన వీఆర్ఏ లకు ప్రమోషన్లు కల్పించాలి,నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏ లను క్రమబద్ధీకరించాలి, వీఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ ప్రధాన డిమాండ్లు గా వారు తెలియజేశారు.ప్రభుత్వం వీఆర్ఏ ల సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణమే చర్చలు జరిపి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
5 వ రోజు సమ్మెలో వీఆర్ఏ ల వంటా–వార్పు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)