అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్ ఏ సి) ఎంవీఎస్ లోకేశ్వరరావు రూ.50వేల రూపాయలు లంచం తీసుంటూ ఏసీబీ వలలో చిక్కారు. జిల్లా కలెక్టరేట్ లోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి డిఆర్ఓ లోకేశ్వరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డిఆర్ఓ లోకేశ్వరరావు 2024 సంవత్సరంలో రెగ్యులర్ పే స్కేల్ క్రమబద్ధీకరణ, సంబంధిత పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు కోసం అధికారిక సహాయం చేసినందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేసిన అమ్ము సూర్య చక్రవర్తి ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అమ్ము సూర్య చక్రవర్తి నుండి లోకేశ్వరరావు 50 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎసిబికి చిక్కిన అల్లూరి డిఆర్ఒ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)