ప్రజాశక్తి - కొత్తపేట
రావులపాలెం బ్రిడ్జి నుంచి వెదిరేశ్వరం మీదుగా పలివెల బ్రిడ్జి వరకు జాతీయ రహదారి 9 కి.మీ ల పొడవునా పాడై దెబ్బతిన్న మట్టి రోడ్డుగా మారిపోయిన మెటల్ రహదారిని బిటి రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక మరమ్మతుల కింద రూ.20కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎంఎల్ఎ బండారు సత్యానందరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారి 216ఎ లో 22.730 కి.మీ నుంచి 27.600 కి.మీ వరకూ రూ.10 కోట్లు, 27.600 కి.మీ నుంచి 31.710 కి.మీ వరకూ రూ.10 కోట్లు మొత్తం రూ.20 కోట్లు మంజూరు అయ్యాయయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడు నెల ల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు, ఈ రహదారి అభివృద్ధితో వాహనదారుల సమస్యలు పరిష్కారం కానున్నాయని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం ఈ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)