మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ...

1 గంట క్రితం

District Collector inspects EVM warehouse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్


ప్రజాశక్తి-కాకినాడ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కాకినాడలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గోదామును జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం నెలవారీ సాధారణ తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పే నాయక్, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాములో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాలు, గోదాము నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోదాము నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈవీఎంల భద్రత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత వ్యవధిలో గోదామును తనిఖీ చేస్తూ, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సూపరింటెండెంట్ విశ్వనాథ శాస్త్రి, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
District Collector inspects EVM warehouse



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్