బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజి అశోక్ కుమార్

10 అక్టోబర్, 2026

పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజి అశోక్ కుమార్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం

అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోటిపల్లిలోని పుష్కర ఘాట్ ను ఐజి జివిజి.అశోక్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రణాళాకాబద్దంగా పరిశీలిస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కోటిపల్లి లోని బస్టాండ్‌ను, స్నాన ఘట్టాలను, పోలీస్ ఔట్‌ పోస్టులను ఆయన పరిశీలించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్షించినట్లు ఐజి వివరించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల సౌకర్యం, వాహనాల పార్కింగ్, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై, ఆర్టిసి అధికారులతో, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. బస్టాండ్ల నుంచి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్కు వచ్చే రైళ్లు వివరాలు అక్కడికి వచ్చే యాత్రికులను తరలించే ఏర్పాట్లపైన ఆయన సంబంధిత అధికారులతో సమీక్షచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి రాహుల్ మీనా , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్