ప్రజాశక్తి-వేపాడ: వేపాడ మండలం కరకవలసి పంచాయతీ పరిధిలో గల మారిక గిరిజన గ్రామం సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది గిరిజనులు ఓటు వేయాలంటే ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అష్ట కష్టాలు పడి కాలినడకతో రావలసినదే గత ప్రభుత్వం గిరిజనులను ఓటు వేయించుకొని రోడ్డు వేయడానికి కాలయాపన చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయడానికి ఏడు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. గుత్తేదారుడు అశ్రద్ధ వలన వేసిన రోడ్డు వర్షానికి పాడైపోయి వాహనాలు రాకపోకలకు, కాలినడకన రావడానికి కూడా వీలు కాకుండా వేసిన రోడ్డు ఎక్కడికక్కడ ముక్కలుగా వర్షం నీరుకి గుంతలు పడి కోతకు గురైపోయింది. పలుమార్లు గిరిజనులు పోయిన రోడ్డును స్వతంత్రంగా బాగు చేసుకున్నప్పటికీ ఏం మాత్రం వర్షం వచ్చినా ఎప్పటి మాదిరిగా రోడ్డు పాడైపోతుంది. పలుమార్లు కాంట్రాక్టర్ చేపట్టిన పనులు నాణ్యత లోపం వలన ఈ విధంగా రోడ్డు తయారైందని ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని ఎంపీపీ గొంప వెంకట్రావు దృష్టికి గ్రామానికి వచ్చిన సందర్భంగా తెలియచేయడం జరిగింది. మండలం ఏర్పడినప్పటి నుండి ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారం చలాయించారు కానీ మా గ్రామాన్ని సందర్శించి మా కష్టాలు చూసిన దాఖలాలు కూడా లేవు. గొంప వెంకటరావు ఎంపీపీ అయినా అతి తక్కువ కాలంలోనే మా గిరిజన గ్రామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చి అసంపూర్తిగా ఉన్న రోడ్డుని పూర్తి చేయించే బాధ్యత నాదని మాట ఇచ్చినందుకు గిరిజనులు వెంకట్రావుకి అభినందనలు తెలిపారు.
రోడ్డు కష్టాలు ఎప్పుడు తప్పుతాయో?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 01:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)