ప్రజాశక్తి - రామచంద్రపురం
మానసిక ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామచంద్రాపురం సీనియర్ సివిల్ జడ్జి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం రామచంద్రాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగింది. కార్యక్రమంలో ఆయన పాల్గొన జడ్జి మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని వివక్షతో చూడకుండా, వారికి కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలవాలని తెలిపారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, అవసరమైన వారికి సహకారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. ప్రవీణ్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవాలని ఆయన సూచించారు, మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని తెలిపారు. పని ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని చిన్నచూపు చూడకుండా, వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలవాలని సూచించారు. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గొల్లపల్లి కృష్ణ ,నర్సింగ్ సూపర్డెంట్ జయప్రద, ఎజిపి లకాని పద్మ కమల కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటిపల్లి లోవరాజు, ప్యానాల్ న్యాయవాదులు పలివెల సత్యనారాయణ దొమ్మలపాటి సత్యనారాయణ, నందిక కళ్యాణి, సెక్యూరిటీ సూపర్వైజర్ పలివెల శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సిబ్బంది సుభాషిని, వైద్య సిబ్బంది నాగన్న, అనూష తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు








కామెంట్లు (0)