బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉప్పలగుప్తంలో 29వ రోజుకు విఆర్ఎ ల దీక్షలు

1 గంట క్రితం

ఉప్పలగుప్తంలో 29వ రోజుకు విఆర్ఎ ల దీక్షలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉప్పలగుప్తం: అపరిష్కృతంగా ఉన్న విఆర్ఎల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని విఆర్ఎలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విఆర్ఎ ల జెఎసి పిలుపుమేరకు ఉప్పలగుప్తంలో చేస్తున్న విఆర్ఎల దీక్షలు బుధవారం 29వ రోజుకు చేరుకున్నాయి. అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఉందుర్తి అంజలరావు ఆధ్వర్యంలో విఆర్ఎలు తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని పే స్కేల్ అమలు చేయాలని ప్రమోషన్ కోటాను ఇప్పుడున్న 30 శాతం నుంచి 70 శాతంకు పెంచాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విఆర్ఎ ల అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి జల్లి రాంజీ, విఆర్ఎలు నేదునూరి పట్టాభి రామయ్య, కోటుం వెంకటేశ్వరరావు, దోనిపాటి రెడ్డి, షేక్ ఖాదర్ బాషా, సాదే విజయలక్ష్మి, మల్లిపూడి సందీప్, పడుచూరి ఫణి, కుమార్ మమానపల్లి సురేష్ కుమార్, మెండి లోవరాజు, మధుర సతీష్, కుంచే మహేష్, గుత్తుల వెంకటరమణ, జగడం లింగమూర్తి, కాశి మంగ, కూచిపూడి సత్యనారాయణమ్మ, కమిడి కుమారి, దంగేటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్