ఐ.పోలవరం:
అర్నబ్ తు;eను కారణంగా ఐ.పోలవరంలో వివిధ గ్రామాలు గుత్తెనదీవి,పాత ఇంజరం,ఎదుర్లంక, కేశనకుర్రు,కొమరగిరి తదితర గ్రామంలో మంగళవారం, బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురిశాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, చెట్ల కొమ్మలు,హోల్డింగులు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంటర్నెట్ సేవలు కూడా అంతరం ఏర్పడింది. ఈ సందర్భంగా రాకపోకలు అంతరయం ఏర్పడింది. ఐ.పోలవరం ఎస్ఐ ఎం.రవీంద్రబాబు, బృందం సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎదుర్లంక నుంచి మురుమళ్ళ రాఘవేంద్ర వారధి వరకు రహదారి ఇరువైపులా నేలకొరుగున చెట్లను జెసిబిల సహకారంతో చెట్లను తొలగించే పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. గురువారం కరెంటు సరఫరా లేక పోవటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రెండు, మూడు రోజులు విద్యుత్తు సరఫరా రావటానికి సమయం పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. పాతఇంజరంలో పలువురు రైతులు ప్రజాశక్తి విలేకరులతో మాట్లాడుతూ వరి పంట నేలకొరిగి వల్ల 90 శాతం పైగా నష్టం జరిగిందన్నారు. వరి పంట చేతికొచ్చే సమయంలో అర్నబ్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా దెబ్బసిందన్నారు. ఎకరానికి రూ 40వేలు పెట్టుబడి పెట్టడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమంది కౌలు రైతులు వరి సాగు చేస్తున్నారని అన్నారు. మండలంలో సుమారు 8వేలు ఎకరాలు నేలకు ఒరిగినట్లు అన్నారు.








కామెంట్‌లు (0)