ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో మహా ముట్టడి జయప్రదానికి పిలుపు... పోస్టర్లు ఆవిష్కరించిన సిఐటియు నాయకులు

5 రోజుల క్రితం

ఢిల్లీలో మహా ముట్టడి జయప్రదానికి పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమలాపురం

​నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి,కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న కార్మికుల మహా ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం అమలాపురం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడేందుకు నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలనీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనీ సర్ ప్రక్రియని రద్దు చేయాలని కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని, ఆ సంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని, నీరు, అడవి భూమిపై ప్రజల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీలలో ఢిల్లీలో జరిగే ముట్టడి కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, కొబ్బరి ఓలుపు కార్మికులు జట్టు హమాలి తదితర కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు, జి.దైవ కృప, సుజాత, పి .మురళీకృష్ణ, పి. వెంకటేశ్వరరావు, కే .శ్రీనివాస్ ,కే.వీ. సత్యనారాయణ ,సాధనాల శ్రీనివాసరావు, నక్క సతీష్ బాబు, వై. రవి తదితరులు పాల్గొన్నారు. ​ ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు, పెద్దక్క, ఓబులప్ప, సూరి, ముత్యాలప్ప, రమేష్, మారుతి, నారమ్మ, తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్