ప్రజాశక్తి -మామిడికుదురు.
నగరం గ్రామం తాడివారి గ్రూపు (గెద్దాడ హైవే దగ్గర) ఒఎన్‌జిసి గ్యాస్ బావి నుంచి గ్యాస్ లీకేజీ ఏర్పడిన నేపథ్యంలో రాజోలు నియోజకవర్గం వైసిపి ఇంచార్జి, మాజీ ఎంఎల్ ఎ పాముల రాజేశ్వరిదేవి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులు, ఆర్డిఒ తో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. లీకేజీని త్వరితగతిన సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగిన తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు, ఆహారము త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు ఆమె వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శిపాముల దేవీ ప్రకాష్ తదితరులు ఉన్నారు.
నగరం గ్యాస్ లీకేజీ పరిస్థితులపై ఆర్డిఒతో మాట్లాడుతున్న మాజీ ఎంఎల్ఎ రాజేశ్వరి







కామెంట్‌లు (0)