ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి...

5 రోజుల క్రితం

ప్రజాశక్తి ఆలమూరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* మండలంలో ఆరు క్లస్టర్లగా పంచాయతీల విభజన

* ఈ నెల 18 నుంచి 20 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ.

​

ప్రజాశక్తి - ఆలమూరు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలో ఎన్నికల నిర్వహణకు ఈ నెల 29న జరగనున్న అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంగళవారం ఎంపిడిఒ రాజు తెలిపారు. ఈ నెల 29న జరగనున్న ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 18 నుంచి 20 వరకు కొనసాగుతుందన్నారు. అలాగే అభ్యర్థులకు సులభతరంగా ఉండేలా మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలను ఆరు క్లస్టర్లగా విభజించి, వాటికి ప్రధాన నామినేషన్ కేంద్రాలను నిర్ణయించామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు, అధికారికంగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సంబంధిత కేంద్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.


​అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు

​ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత నామినేషన్ కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచించిన విధంగా నిర్ణీత నమూనాలో నామినేషన్ పత్రాలను సమర్పించాలని ఎంపిడిఒ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, డిపాజిట్ తదితర అంశాలను పాటించాలన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం సూచనలు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఎఒ మెహర్ ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, సిబ్బంది పాల్గొన్నారు.


ఆరు క్లస్టర్ల కేంద్రాల వివరాల

1 : మడికి, చెముడులంక, బడుగువానిలంక గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: మడికి గ్రామ పంచాయతీ కార్యాలయం.2 : చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం, నవాబుపేట గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: చొప్పెల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం.3 : ఆలమూరు, జొన్నాడ గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: ఆలమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం.4 : పెదపళ్ల, కలవచర్ల, పెనికేరు గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: పెదపళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం.5 : చింతలూరు, సూర్యారావుపేట, పినపళ్ల, సంధిపూడి గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: చింతలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం.6 : నర్సిపూడి, మోదుకూరు, గుమ్మిలేరు గ్రామ పంచాయతీలు. నామినేషన్ కేంద్రం: నర్సిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్