శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాడిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు2 రోజుల శిక్షణ

6 రోజుల క్రితం

తాడిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు2 రోజుల శిక్షణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రామచంద్రపురం

​మండలంలోని తాడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఎరువులు వినియోగంపై రెండు రోజులు పాటు రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించామని మండల వ్యవసాయ అధికారి టివిఆర్. మణిదీప్ తెలిపారు. ఆత్మ ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం పరిధి లో గల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లో రైతులకు సేంద్రియ వ్యవసాయం, భూసార పరిరక్షణ పద్ధతులు అనే అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు. ఈ శిక్షణ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయా సంచాలకులు బి. నాగకుమార్ రైతు శిక్షణా కేంద్ర నుండి విచ్చేసిన వ్యవసాయ అధికారి మనోహర్, మండల వ్యవసాయ అధికారి మణిదీప్ రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలు ఏ విధంగా అమలు చేయాలి, పెట్టుబడి తగ్గించుకునే లాభసాటి వ్యవసాయం చేసే విషయాలను వివరించారు. అదేవిధంగా సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణ చర్యలు పచ్చిరొట్ట విత్తనాలు నాటి భూసారాన్ని పెంచుకునే విధానాలు, పంటల దిగుబడి పెంపు, వ్యవసాయ ఖర్చుల తగ్గింపు ఖరీదైన క్రిమిసంహారకాలు వాడకం తగ్గించటం వంటి అంశాలపై నిపుణులచే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్