మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు నెలల సాధనతో 1539 ఫిడే చెస్ రేటింగ్ సాధించిన ప్రణతి మద్దింశెట్టి

3 రోజుల క్రితం

ఆరు నెలల సాధనతో 1539 ఫిడే చెస్ రేటింగ్ సాధించిన ప్రణతి మద్దింశెట్టి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి అమలాపురం

​

​చదరంగం (చెస్) ఆటను ప్రారంభించిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అమలాపురం పట్టణానికి చెందిన మద్దింశెట్టి ప్రసాద్ కుమార్తె మద్దింశెట్టి ప్రణతి(1539 ) అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించి అరుదైన ప్రతిభను చాటుకుంది. ఇటీవల కర్నూలులో జరిగిన చెస్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచి ఈ అంతర్జాతీయ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

​అమలాపురంలోని ఐరా ఇంటర్నేషనల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణతి, స్థానిక 'వేద్ చెస్ అకాడమీ' చీఫ్ కోచ్ జి.వి. రమణ వద్ద శిక్షణ పొందుతోంది. చదువుతో పాటు రోజుకు 4 నుండి 6 గంటల పాటు క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోగలిగింది.​ఈ సందర్భంగా వేద్ చెస్ అకాడమీ ప్రతినిధులు ప్రణతిని ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ ప్రణతి నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోందని కోచ్ జి.వి. రమణ పేర్కొన్నారు.

చెస్ లో 1539 ఫిడే చెస్ రేటింగ్ సాధించిన ప్రణతి మద్దింశెట్టి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్