మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాట్రేనికోన, పల్లం పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం

3 రోజుల క్రితం

కాట్రేనికోన, పల్లం పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కాట్రేనికోన

మండల పరిధిలోని రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. కాట్రేనికోన గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన నాగిడి ధనలక్ష్మి, పల్లం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దండుప్రోలు సత్యవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాట్రేనికోన గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నాగిడి ధనలక్ష్మితో పాటు నామినేషన్లు దాఖలు చేసిన ప్రత్యర్థి అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ధనలక్ష్మి మాజీ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ నాగిడి నాగేశ్వరరావు సతీమణి కావడం విశేషం. నాగిడి ధనలక్ష్మి ఏకగ్రీవ ఎన్నికను ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువపత్రం జారీ చేశారు. మొత్తంగా కాట్రేనికోన మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను రెండు పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 14 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోటీ అనివార్యమైంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్