విజయవాడ : సత్వరమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ .... శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద నిర్వాసితులు ధర్నా చేపట్టారు. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నాయని, అయినప్పటికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం నిర్వాసితులు డిమాండ్ చేశారు. విమానాశ్రయ విస్తరణలో నివాసాలు కోల్పోయిన గన్నవరం మండలం బాబాజీ గూడెం దళితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పద్ధతుల్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని, అందరికీ న్యాయం చేస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని, దీంతో ఓపిక నశించి ఆందోళనకు సిద్ధపడుతున్నామని నిర్వాసితులు తెలిపారు. నిర్వాసిత దళితులంతా గన్నవరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. దళితులు కాబట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూడా రానివ్వబోమని పోలీసులు వారిని అడ్డగించారు.









కామెంట్‌లు (0)