చల్లపల్లి (కృష్ణా) : నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తూ ప్రజల్లో ఉండే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. చల్లపల్లి గుంటూరు బాపనయ్య భవన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ... జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలు, 18 ఎంపీటీసీ స్థానాలు, మూడు మున్సిపల్ కేంద్రాల్లో సిపిఎం అభ్యర్థులు పోటీచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన పనిచేసే పార్టీ సిపిఎం అన్నారు. ప్రభుత్వాలు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనీ, 73,74 రాజ్యాంగ సవరణలు అమలుచేయాలని కోరారు. పలువురు నేతలు మాట్లాడుతూ ... చల్లపల్లి రాజా మిగులుభూముల పోరాటాలకు నాయకత్వం వహించిన గుంటూరు బాపనయ్య, చల్లపల్లి నారాయణరావుల స్పూర్తితో ప్రజల కోసం , వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగిస్తున్న వారే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిచారనీ, వారిని ప్రజలు ఆదరించి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు పార్టీ అంటే చరిత్ర అనీ, అభ్యర్థుల నిస్వార్థ సేవానిరతిని గమనించి ప్రజల మధ్య ఉండే పార్టీ వ్యక్తులను ఆదరించాలని కోరారు. ఎర్రజెండా గెలుపు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చల్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థి యద్దనపూడి మదు, ఎంపీటీసీ అభ్యర్థి మహమ్మద్ కరీముల్లా, నేతలు ఎం.పోలినాయుడు, పరుచూరి జనార్ధన్, చల్లపల్లి నారాయణరావు మనుమడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కోసం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి ...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)