సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్

1 గంట క్రితం

Vice President C.P. Radhakrishnan reaches Tirumala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి తిరుపతి టౌన్ (తిరుపతి) : తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా ... భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పి సుబ్బారాయుడు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, టిటిడి బోర్డు సభ్యులు రామ్మూర్తి, తిరుప‌తి ఎమ్మెల్యే అర‌ణి శ్రీ‌నివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్