ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణ కు స్వల్ప అస్వస్థత

20 నవంబర్, 2026

Former MP Konakalla Narayana suffers minor health issue
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సలహా మేరకు హిందు కళాశాల ఎదురుగా ఉన్న స్కానింగ్ సెంటర్లో ఎమ్మారై తీశారు. అనంతరం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జి బండి రామకృష్ణ, రాష్ట్ర మైనారిటీస్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితర ముఖ్య నాయకులు కొనకళ్ల నారాయణ రావుతోపాటు ఆసుపత్రికి వెళ్లారు. కూటమి పార్టీల నేతలు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మాజీ ఎంపి సోదరుడు కొనకళ్ల జగన్నాథరావు ఇలియాస్ బుల్లయ్యను కలిసి పరామర్శించారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్