మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

1 గంట క్రితం

Knife attack on police... Accused shot
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోమటికుంటలాకుల డొంకరోడ్డులో పోలీసులపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో కంకిపాడు సీఐ నిందితుడు అవినాద్ కాళ్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం. నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో నిన్న కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన అవినాద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రి 11 గంటల సమయంలో అతడు కోమటికుంటలాకుల డొంకరోడ్డులో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన అవినాద్ కత్తితో దాడి చేయడంతోపాటు రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిపై గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన అవినాద్‌ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్