ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : రోడ్డుపక్కన భిక్షాటన చేస్తూ, మతిస్థిమితం లేక నిస్సహాయంగా జీవిస్తున్న ఓ వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారైన ఘటన పలమనేరు పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మంగళవారం మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం .. మతిస్థిమితం లేని వృద్ధురాలు కొంతకాలంగా పలమనేరు పట్టణంలోని రోడ్డు పక్కన జీవనం సాగిస్తోంది. ఆకలిగా ఉన్నప్పటికీ ఎవరినీ అడగకుండా, ఎవరైనా ఆహారం అందిస్తే తీసుకుని తింటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే సోమవారం అర్ధరాత్రి అదే వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో వృద్ధురాలు మృతి చెందినట్లు తెలిసింది. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై జీవిస్తున్న వృద్ధురాలిపై ఇంతటి దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి - చికిత్స పొందుతూ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)