ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం, ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయాల్లో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ నేతృత్వంలో ఎంపిపి అనగాని రవి, ఎంపిటిసి సభ్యులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అనగాని రవి మాట్లాడుతూ... గత ఐదేళ్ల కాలంలో రాజకీయాలకు అతీతంగా మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ ద్వారా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనార్టీ వర్గాలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని అన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. జెడ పిటిసి సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌రాణి, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఎమ్ డి గౌసాని, వైస్ ఎంపిపి కాలగడ్డ శివనాగరాజకుమారిలను కూడా నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పలువురు ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)