బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తొలగించాలి

56 నిమిషాల క్రితం

యాపుల భారాన్ని తొలగించండి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వత్సవాయి

ఉపాధ్యాయులపై యాప్‌లు, ఆన్‌లైన్‌ పనుల భారాన్ని తగ్గించి బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఎఐఎస్ టిఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వత్సవాయి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకో యాప్‌, ఆన్‌లైన్‌ పనులతో ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం వంటి పనులతో బోధనా సమయం వృథా అవుతోందని తెలిపారు. యాప్‌లు, బోధనేతర పనులను వెంటనే తొలగించి ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎస్‌ ఉద్యోగుల డిఎ బకాయిలను వారి ప్రాన్‌ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల హాజరు, పదో తరగతి ఫలితాల పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పిడివిప్రసాదరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎం. శ్రీహరి, టి.వి.ఎల్‌.నరసింహారావు, జిల్లా సహాధ్యక్షుడు జి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్