ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
మండలంలోని గ్రామ రెవిన్యూ సహాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం వర్షంలో సైతం సమ్మె చేశారు. వీఆర్‌ఏల ఉద్యమానికి సీపీఎం మండల నాయకుడు పిడుగు దేవసహాయం మద్ధతు ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు ఉడుముల రవికుమార్, ఆ సంఘ నాయకులు చార్లెస్, కిరణ్, ఫైజుల్లా, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)