కోలివుడ్ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా సినిమా 'అప్పకుట్టి’. తండ్రీ కూతుళ్ల అనుబంధంపై దర్శకుడు ము.మారన్ ఈ మూవీని తెరకెక్కించారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానున్నట్లు విజయ్ ఆంటోని తాజాగా ఎక్స్ పోస్టు ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో ఇందులో హీరోయిన్ గా ప్రీతి అస్రానీ నటించారు. ఈ చిత్రాన్ని ఆంటోనీ సొంత నిర్మాణ సంస్థ అయిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో 'నాన్న కుట్టి`గా విడుదల కానుంది.
దసరాకు ‘నాన్న కుట్టి` విడుదల
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)