బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కృష్ణాజిల్లా పురుషుల మహిళా షూటింగ్ బాల్ జట్ల ఎంపిక

1 గంట క్రితం

ఘనంగా కృష్ణాజిల్లా పురుషుల మహిళా షూటింగ్ బాల్ జట్టు ఎంపికలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వీరులపాడు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరులపాడులోని ఏకత్వా అంతర్జాతీయ పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం పురుషులు, మహిళల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సింధూర అమరనేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, ఇవి వినోదంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది రాళ్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఈ ఎంపికల వివరాలను జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్