ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం గ్రామానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్ర స్థాయి జూడో అండర్-19 పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూడో పోటీల్లో ప్లస్-70 కేటగిరిలో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు డిఎస్ఎ కోచ్ శ్రీను తెలిపారు. తిరుపతి వేదికగా ఈనెల 12, 13, 14 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (బైపిసి) చదువుతున్న చిన్మయి చదువుతో గతంలో జూడోతో పాటు ఫెన్సింగ్ (కత్తియుద్ధం), టైక్వాండో, గట్కా, కూరష్ వంటి వివిధ విభాగాల జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త డి. నాగరాజు, కె.గీత, తాన్యగిరి తదితరులు చిన్మయిని అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)