ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమొక్రటిక్ వారు రాష్ట్ర స్థాయి గురుపురస్కారోత్సవాల్ని శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించారు. గుడ్లవల్లేరు ఎఎఎన్ఎమ్ అండ్ వివిఆర్ఎస్ఆర్ ఇం మీ స్కూల్ బయాలజీ టీచర్ జిఎమ్ సత్యబాబు, తెలుగు అధ్యాపకురాలు జి.నాగకన్యలు "విశిష్ట విద్యా ప్రదాత" పురస్కారాలను చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి, అప్సా రాష్ట్ర అధ్యక్షులు గొల్లపూడి మోహనరావు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న ఉపాధ్యాయులకు స్కూల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు, కార్యదర్శి సత్యనారాయణ రావు, సొసైటీ అధ్యక్షుడు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కొడాలి వెంకట కృష్ణారావు, సహా కార్యదర్శి రామకృష్ణ, డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, ప్రిన్సిపల్ కుంజుమన్ లు అభినందనలు తెలిపారు.









కామెంట్‌లు (0)