శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయండి

1 గంట క్రితం

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయండి
ప్రజాశక్తి -రొద్దం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రొద్దం

కదిరి పట్టణంలో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు బాలస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రొద్దంలో కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ చేయాలని, పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు అన్యాయం చేసే అసైన్డ్ భూముల భూబదలాయింపు చట్ట సవరణ రద్దు చేయాలని, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇవ్వాలని, విబిజి ఆర్‌ఎఎం జి పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ. 600 కూలి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

సదస్సులో రైతులు, వ్యవసాయ కూలీలు, సిపిఐ, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షులు బాలస్వామి, సంఘం నాయకులు తిమ్మయ్య, కిష్టప్ప, నారాయణప్ప, తిమ్మారెడ్డి, కొలిమి తిమ్మయ్య, నాగభూషణ, హనుమంత, వేణుగోపాల్, నరసింహప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్