ప్రజాశక్తి-నాగాయలంక:
అవనిగడ్డలో జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో జనసేన పార్టీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌పై కొందరు టిడిపి నాయకులు చేసిన విమర్శలను జనసేన నాగాయలంక మండల నాయకులు ఖండించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ.. జనసేన బలాబలాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జనసైనికులు నిర్వహించిన పాలాభిషేకాలను విమర్శించడం తగదన్నారు. సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై ప్రస్తావించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి హరి, భోగాది శివ విష్ణు, మండలి ఉదయభాస్కర్ తదితరురలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)