సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం

10 అక్టోబర్, 2026

ఐతవరం సొసైటీలో నూతన క్యాష్ కౌంటర్ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -నందిగామ

రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. నందిగామ మండలం ఐతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను శనివారం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలను విస్తరించడం ద్వారా రైతులకు, ఖాతాదారులకు స్థానికంగానే బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మద్దుకూరి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్