బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్ సిసితో యువతలో దేశ భక్తి, జాతీయభావం

1 గంట క్రితం

ప్రజాశక్తి ఉయ్యూరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఉయ్యూరు

​ఎన్ సిపితో యువతలో దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ అలవడుతుందని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. శ్రీ విశ్వశాంతి స్కూల్ అవరణలో కాకినాడ ఎన్ సిసి గ్రూపు హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో విజయవాడ-1 ఆంధ్ర ఇఎంఇ ఎన్ సిసి కంపెనీ "పర్యవేక్షణలో జరుగుతున్న స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ సమైఖ్యత, దేశభక్తి పెంపొందిచే స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కాకినాడ గ్రూపు ఆంధ్ర ఇఎంఇ కంపెనీ కమాడింగ్ ఆఫీసర్ కల్నల్ జ్ఞాన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, దేశంలోని 17 డైరెక్టరేట్ల నుంచి ఎన్ సిసి క్యాడెట్లు ఈ క్యాంపులో పాల్గొంటారని తెలిపారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్